Lightning: పిడుగుపాటుకు గురై 24 గంటల్లో 25 మంది మృతి..
- బీహార్ వ్యాప్తంగా భారీ వర్షాలు..
- పిడుగుపాటు ఘటనల్లో 25 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning: బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు, పిడుగుపాటులు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగుపాటు ఘటనల కారణంగా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లోనే 25 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. మరణాల పట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షం, పిడుగులు పడే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు.
Read Also: India-Russia Relations: ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అమెరికా అసంతృప్తి..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మరణించిన 25 మందిలో, మధుబనిలో ఐదుగురు, ఔరంగాబాద్‌లో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, నలందలో ముగ్గురు, లఖిసరాయ్ మరియు పాట్నాలో ఇద్దరు చొప్పున, బెగుసరాయ్, జాముయి, గోపాల్‌గంజ్, రోహ్తాస్, సమస్తిపూర్, పూర్నియాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. బీహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం, ఒక్క జూలైలోనే పిడుగుపాటు కారణంగా 50 మంది మరణించారు. అయితే, అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
బీహార్‌లోని పలు జిల్లా్ల్లో గురువారం భారీ వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది. శుక్రవారం పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కిషన్‌గంజ్, అరారియా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటు వల్ల 17 మంది గాయాలపాలయ్యారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!