సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా తొలికేసు నమోదైంది. రెండేళ్ల కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తొలికేసు నమోదైనపుడు దేశంలో తెలియని భయం నెలకొన్నది. కరోనా కేసులు నమోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు సరైన కిట్లు, వ్యాక్సిన్లు అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్నది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 94 వేల మంది మృతి చెందారు. సెకండ్ వేవ్ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేశారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ నడుస్తున్నది. కేసులు పెరుగుతున్నా, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది, వ్యాక్సిన్ తీసుకోవడం వలన తీవ్రత తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read: జీతాల బిల్లుల చెల్లింపులు ఎలా?
2020, జనవరి 30 వ తేదీన వూహాన్లో యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థికి కరోనా సోకింది. కేరళకు చెందిన ఆ యువతి సెమిస్టర్ సెలవుల సమయంలో చైనా నుంచి ఇండియా వచ్చిన తరువాత ఆమెకు కరోనా సోకింది. ఆ తరువాత వరసగా కేసులు నమోదవుతూ వచ్చాయి. మొదటి వేవ్ సమయంలో కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. ఆ తరువాత కరోనా కిట్లు అందుబాటులోకి రావడంతో టెస్టుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు రోజులకు లక్షల సంఖ్యలో టెస్టులు, వ్యాక్సిన్లు ఇస్తున్నారు.