12-yr-old boy gets notice to pay Rs 2.9 lakh over Ram Navami clashes: మధ్యప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడికి రూ. 2.9 లక్షలు జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో శ్రీరామనవమి రోజున జరగిన హింసాకాండలో బాలుడు క్రియాశీలకంగా పాల్గొన్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో నష్టపరిహారం కింద రూ. 2.9 లక్షలు చెల్లించాలని బాలుడికి, రూ. 4.8 లక్షలు జరిమానా చెల్లించాలని బాలుడు తండ్రి కూలీ అయిన కాలు ఖాన్ కు క్లెయిమ్ ట్రెబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
నిరసలు, సమ్మెలు, హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే వారి నుంచి రికవరీ చేయడానికి పబ్లిక్ ప్రావర్టీ, నష్టాల నివారణ-రికవరీ బిల్లును మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టం కింద ప్రభుత్వ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 10న ఖార్గోవ్ నగరంలో రామనవమి ఊరేగింపు సమయంలో ఓ వర్గం వారు దాడి చేశారు. ఈ సమయంలో 12 ఏళ్ల బాలుడు, ఇతర వ్యక్తులతో కలిసి తమ ఇంట్లో దోపిడికి పాల్పడి, ధ్వంసం చేశాడని స్థానికంగా ఉండే మహిళ ఆరోపించింది.
Read Also: Congress President Election: ఖర్గే వర్సెస్ థరూర్.. కాంగ్రెస్ అధ్యక్షుడెవరో తేలేది నేడే..
ఈ నేపథ్యంలోనే బాలుడికి, అతని తండ్రికి క్లెయిమ్ ట్రెబ్యునల్ నష్టపరిహారం కింద జరిమానా విధిస్తూ.. డబ్బులు కట్టాలని నోటీసుల జారీ చేసింది. అయితే దీనిపై బాలుడి తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకు మైనర్ అని.. అల్లర్లు జరిగినప్పుడు తామంతా నిద్రపోతున్నామని.. మాకు న్యాయం కావాలని అన్నారు. తమ కొడుకును పోలీసులు అరెస్ట్ చేస్తారని నిత్యం భయపడుతున్నామని బాలుడి తల్లి చెప్పింది.
దీనిపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. వారికి ముస్లింలు అంతే ఎంత ద్వేషమో అర్థం అవుతుందని.. ఇప్పుడు వారు పిల్లల్ని కూడా వదలడం లేదని.. జువైనల్ యాక్ట్ ప్రకారం.. పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే దురుద్దేశంతో, నేరపూరిత ఉద్దేశ్యానికి పాల్పడలేదని భావించాలని ఆయన ట్వీట్ చేశారు. పిల్లల నుంచి రీకవరీ చేస్తారా..? అంటూ బీజేపీ సర్కార్ ను ప్రశ్నించారు. ఏప్రిల్ 10న ఖార్గోన్ జిల్లాలో శ్రీరామ నవమి ఊరేగింపు సమయంలో హింస చెలరేగింది. దుండగులు శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. హింసాత్మక ఘటనలకు కారణం అయింది. ఈ ఘర్షణల్లో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యారు. 170 మందిపై కేసులు నమోదు అయ్యాయి.