104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
104 యూట్యూబ్ ఛానెళ్లతో పాటు 45 వీడియోలను, 4 ఫేస్‌బుక్ ఖాతాలు, మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, ఐదు ట్విట్టర్ హ్యాండిల్స్, ఆరు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, విదేశీలతో స్నేహపూర్వక సంబంధాల ప్రయోజనాల ప్రభావాన్ని చూపించే డిజిటల్ మీడియా కంటెంట్ నిరోధించడానికి వీటిని బ్లాక్ చేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Read Also: Errabelli Dayakar Rao: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఐటీ రూల్స్ లోని పార్ట్-2 నిబంధన ప్రకారం, 2021 నుంచి అక్టోబర్ 2022 వరకు ఐటి రూల్స్‌లోని పార్ట్-2 నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వెబ్‌పేజీలు, వెబ్‌సైట్‌లు, పోస్ట్‌లు, ఖాతాలతో సహా 1,643 యూజర్ జనరేటెడ్ యూాఆరఎల్ లను బ్లాక్ చేసినట్లు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత విషయంలో అవసరమైతే భవిష్యత్తులో చర్యలు తీసుకోవడానికి వెనకాడం అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
చాలా వరకు పాకిస్తాన్, టర్కీ దేశాల నుంచి భారత వ్యతిరేక యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తుంటాయి. ప్రధాని మోదీ, జమ్మూ కాశ్మీర్, ముస్లింల విషయంలో తప్పుడు కంటెంట్ ను యూట్యూబ్ ఛానెళ్లతో పోస్ట్ చేస్తూ.. జాతీయ భద్రతకు, శాంతికి భంగం కలిగించేలా ప్రయత్నిస్తున్నందుకే ఈ యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది కేంద్రం.