104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
భారతదేశంపై తప్పుడు ప్రచారం, వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్న మరో 16 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భారత్‌కు సంబంధించిన ఏడు ఛానళ్లు, పాక్‌కు చెందిన మరో ఛానల్ ఉంది.. ఫేక్ వార్తలు, భారతదేశ వ్యతిరేక కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నందుకు గాను.. ఎనిమిది ఛానెల్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని యూట్యాబ్‌ను కోరింది భారత ప్రభుత్వం.. దీంతో, గత ఏడాది డిసెంబర్ నుండి ఇప్పటి వరకు బ్లాక్ చేసిన ఛానళ్ల…