Pickup Van Electrocuted: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జల్పేష్కు వెళుతున్న పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై 10 మంది మరణించినట్లు ఆదివారం అర్థరాత్రి పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లో ఉన్న 27 మందిలో 16 మంది వ్యక్తులకు స్వల్ప గాయాలైనందున చికిత్స కోసం జల్పైగురి ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లోని డీజే సిస్టమ్‌కు చెందిన జనరేటర్ వైరింగ్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
“ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు, మెఖ్లిగంజ్ పీఎస్ పరిధిలోని ధార్ల వంతెన వద్ద జల్పేష్కు వెళుతున్న ప్రయాణికులతో వెళ్తున్న ఒక పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురైంది. జనరేటర్ (డీజే సిస్టమ్) వైరింగ్ కారణంగా ఇది జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వాహనం వెనుక భాగంలో దానిని అమర్చారు” అని మతాభంగా అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమిత్ వర్మ తెలిపారు.
“వారిని చంగ్రబంధ బీపీహెచ్సీ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. హాజరైన మెడికల్ ఆఫీసర్ 27 మందిలో 16 మందిని మెరుగైన చికిత్స కోసం జల్పైగురి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారికి స్వల్ప గాయాలు ఉన్నాయి, అయితే క్షుణ్ణంగా తనిఖీ చేయవలసి ఉంది. హాజరైన వైద్యాధికారి 10 మంది మరణించినట్లు ప్రకటించారు.” అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రయాణికులంతా సీతాల్కుచ్చి పీఎస్ పరిధిలోని వారని, ఈ విషాద ఘటనపై వారి కుటుంబాలకు సమాచారం అందించామని ఆయన తెలిపారు.
Boy Found Dead Inside Washing Machine: వాషింగ్ మెషీన్లో బాలుడు మృతి.. కేసులో ట్విస్ట్
“వాహనం సీజ్ చేయబడింది కానీ డ్రైవర్ తప్పించుకున్నాడు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. పోలీసులు సహాయం, అవసరమైన సహాయం కోసం సమన్వయం చేస్తున్నారు” అని ఎస్పీ అమిత్ వర్మ చెప్పారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.