US Visa: రికార్డ్ బద్ధలు..ఈ ఏడాది 10 లక్షల భారతీయులకు అమెరికా వీసాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Visa: భారత్, అమెరికాల మధ్య ఇటీవల కాలంలో బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో భారతదేశానికి అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది. భారతీయులకు వీసాలను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 10 లక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలను మంజూరు అయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికార సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అన్ని రకాల వీసాలు కలిసి ఈ రికార్డు నమోదైంది.
మిషన్ 1M పూర్తైంది. భారత్ లో ఈ ఏడాది వీసాల ప్రక్రియలో మేం పెట్టుకున్న మిలియన్ వీసాల జారీ లక్ష్యాన్ని దాటేశాం. అయితే మేం ఇక్కడితో ఆగిపోం. రాబోయే నెలల్లో మరింత వృద్ధి సాధిస్తాం. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తామని అమెరికా ఎంబసీ తన పోస్టులో రాసుకొచ్చింది.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Stroke: వాయుకాలుష్యం, పక్షవాతం మధ్య సంబంధం.. పరిశోధకులు ఏం చెప్పారంటే.?
అమెరికా రాయబార కార్యాలయం ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. ఈ రికార్డుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బంధ మాదని, మా ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ ముఖ్యమైందని, ఈ బంధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రాబోయే రోజుల్లో మరింత మంది భారతీయులకు వీసాలు అందచేస్తామని ఆయన తెలిపారు. 2022 ఏడాది మొత్తం వీసాలకు మించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ అయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ. ప్రస్తుతం అమెరికా ప్రపంచవ్యాప్తంగా వీసాలు జారీ చేసే మొత్తంలో 10 శాతం భారతీయులకే వచ్చాయి. విద్యార్థి వీసాల్లో 20 శాతం, హెచ్, ఎల్ కేటగిరి ఉద్యోగ వీసాల్లో 65 శాతం భారతీయులకే వచ్చాయి.
#Missionto1M accomplished! We are excited to announce that the U.S. Mission to India has reached and surpassed our goal to process one million visa applications in 2023!
We will not stop here and continue our progress in coming months, to give as many Indian applicants the… pic.twitter.com/4mTypC2wqh
— U.S. Embassy India (@USAndIndia) September 28, 2023
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..