YVS Chowdary Sensational Comments on Jr NTR: తన తాజా సినిమా ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి డైరెక్టర్ వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా కంటిన్యుటీ సినిమాలు చూస్తుంటేనే దగ్గరకు వెళ్లి సినిమాలు చేయమని అడగగలమని అన్నారు. ”నందమూరి కుటుంబంలో హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేశారు, మరి ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు చేయలేదనే ప్రశ్న వైవీఎస్ చౌదరికి ఎదురైంది.
OG: అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు.. గెట్ రెడీ?
దీనికి ఆయన సూటిగా సమాధానం చెప్ప కుండా ‘ఎన్టీఆర్ కు ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని ఎవరు చెప్పారు? ఆయన చెప్పారా, ఎన్టీఆర్ గారే స్వయంగా చెప్పారా’ అంటూ ఎదురు ప్రశ్నలు వేయడం హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ కు తన మనవళ్లందరూ సమానమే అని, అభిమానులూ అందరినీ సమానంగానే ఆరాధిస్తారని, ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని చెబుతూ స్టైల్ లో చెప్పుకొచ్చారు వైవీఎస్ చౌదరి. ఇప్పుడు చేస్తున్న సినిమా హిట్టయితే, ఎన్టీఆర్ కు సరిపడ కథ ఉంటే, తప్పకుండా ఎన్టీఆర్ ని అప్రోచ్ అవుతానని తాను ఒక్క కాంపౌండ్ కే చెందిన వాడ్ని కాదని, అక్కినేని, ఘట్టమనేని, కొణిదెల కుటుంబ హీరోలతోనూ సినిమాలు చేశానని గుర్తు చేస్తూ కామెంట్ చేశారు వైవీఎస్.