Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
- సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా బుమ్రా
- బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంపై మాజీ క్రికెటర్ ఫైర్
- భారత్ మ్యాచ్‌లు మాత్రం బుమ్రా ఎందుకు ఆడడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Manjrekar Slams Bumrah’s Workload Management: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంపై మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బుమ్రాను టీ20 సిరీస్‌ల నుంచి తప్పించినప్పటికీ.. ఆ నిర్ణయం తనకు పూర్తిగా అర్థం కావడం లేదని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడినప్పుడు.. భారత్ మ్యాచ్‌లు ఎందుకు ఆడడు అంటూ మంజ్రేకర్ ప్రశ్నించాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ సెలెక్టర్లు చెప్పారు. అయితే ఐపీఎల్ 2026 మొత్తం సీజన్లో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడినప్పుడు.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడటం పెద్ద సమస్య కాదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ మంజ్రేకర్ తన సందేహాలను వ్యక్తం చేశాడు. ‘బుమ్రా కెరీర్ ప్రస్తుతం ఎలా సాగుతోందో నాకు కొంత అయోమయంగా ఉంది. అతడే భారత టీ20 జట్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను భావించాను. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో బుమ్రా వర్క్‌లోడ్‌ను సులభంగా నిర్వహించగలడనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలనే ఆసక్తి అతడిలో కనిపించడం లేదు’ అని పేర్కొన్నాడు.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
గతంలో కూడా బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై అనేక చర్చలు జరిగాయి. అతడిని ఎంపిక చేసిన కొన్ని సిరీస్‌లకు మాత్రమే సిద్ధం చేయడం, మిగిలిన టోర్నీలకు విశ్రాంతి ఇవ్వడం సరైన విధానమా అనే ప్రశ్నలు తరచూ వినిపించాయి. ఈ విషయంపైనే మంజ్రేకర్ కూడా స్పందించాడు. ‘టెస్ట్ క్రికెట్ విషయంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ అవసరమని నేను అంగీకరిస్తాను. అలాగే వన్డే క్రికెట్ కూడా శారీరకంగా చాలా కఠినమైన ఫార్మాట్. కానీ ఐపీఎల్ మొత్తం సీజన్ ఆడిన బుమ్రా.. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో జరిగే కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడలేడని చెప్పడం నాకు అర్థం కావడం లేదు. అతడు భారత్ తరఫున మరింత కమిట్మెంట్ చూపించాలని నేను కోరుకుంటున్నాను’ అని మంజ్రేకర్ స్పష్టం చేశాడు.
బీసీసీఐ మాత్రం జస్ప్రీత్ బుమ్రా దీర్ఘకాలిక ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో గాయాల కారణంగా బుమ్రా కీలక టోర్నీలకు దూరమైన నేపథ్యంలో.. అతడిపై అదనపు భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరంగా ఉన్న బుమ్రా.. ఆసియా క్రీడల్లో మాత్రం భారత జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. దీంతో స్టార్ పేసర్ వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై మరోసారి క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం బుమ్రా ఫిట్నెస్ను కాపాడటం ముఖ్యమా? లేక జాతీయ జట్టుకు మరింతగా అందుబాటులో ఉండాలా? అనే అంశంపై అభిమానులు, మాజీ క్రికెటర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..