యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్, ప్రణతిల ఫోటో బయటకి వచ్చి ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ ని అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీతో పాటు వెళ్లిన ఎన్టీఆర్ జనవరి 5న తిరిగి హైదరాబాద్ రానున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ హోటల్ లో ఉన్న ఎన్టీఆర్, 3వ తారీఖు వరకూ అక్కడే ఉంది 5న హైదరాబాద్ రానున్నాడట. జనవరి 5న ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగి రానున్నాడు అనగానే కొంతమంది నందమూరి అభిమానులు షాక్ అవుతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి ఎంపిక అయ్యింది, ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ జనవరి 10న గ్రాండ్ గా జరగనుంది. జనవరి 5న ఎన్టీఆర్ ఇండియా వచ్చేస్తే మరి 10న గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ కి వెళ్లడా? అనే ప్రశ్న అందరిలోను ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలి అంటే జనవరి 10 వరకూ ఆగాల్సిందే. 5న హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్, గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ కోసం ‘ఆర్ ఆర్ ఆర్’ టీంతో కలిసి వెళ్తాడేమో.
ఇక ఎన్టీఆర్ తిరిగి రాగానే ‘ఎన్టీఆర్ 30’ మొదలుపెట్టాలని వెయిట్ చేస్తున్న కొరటాల శివ, జనవరి 22న ‘ఎన్టీఆర్ 30’ పూజా కార్యక్రమాలని ప్లాన్ చేసాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ అవ్వడంతో జనవరి 22న పూజా కార్యక్రమాలు పెట్టుకోని, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్ళాలనేది కొరటాల శివ ప్లాన్. అయితే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడం కన్నా ముందే ఒక వీడియో బయటకి వస్తుందని నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మోషన్ పోస్టర్ వచ్చేసింది కాబట్టి కొరటాల శివ ఏ వీడియో వదులుతాడు అనేది చూడాలి. వీడియో కాకుండా ఫస్ట్ రోజు షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ ఉన్న పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ పాన్ ఇండియా మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు, హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.