NTR: ఇంకో వారం రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలుకబోతున్నాం.. ఇక ఈ ఏడాదిలో జరిగిన అద్భుతాలు ఏవి..? మంచి సినిమాలు, చెత్త సినిమాలు.. కొత్త హీరోయిన్లు.. కొత్త హీరోలు.. బాలీవుడ్ కు వెళ్లిన హీరోలు.. అక్కడి నుంచి వలస వచ్చిన హీరోయిన్లు అంటూ ఫిల్మీ రివైండ్ లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో సైతం ఈ ఏడాది తమ అభిమాన హీరోలు ఎన్ని సినిమాలు తీశారు.. ఏ హీరోకు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది.. అసలు ఈ సంవత్సరం ఏ హీరోలు తెరపై కనిపించారు అంటూ పోలింగ్ పెట్టేస్తున్నారు.. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది బెస్ట్ ఎలివేషన్ సీన్ ఏది అంటూ అభిమానులు పెద్ద చర్చే మొదలుపెట్టారు.. అందులో యూనానిమస్ గా ఎంపికయ్యింది ఆర్ఆర్ఆర్ లో తారక్ ఇంటర్వెల్ సీన్. ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అంటే ఆర్ఆర్ఆర్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చిలో రిలీజై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ను మొదటి స్థానంలో నిలబెట్టింది. ఇక ఈ చిత్రంలో సీతారామరాజు గా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటనను మర్చిపోవడం సాధ్యంకాని పని. ముఖ్యంగా కొమరం భీమ్.. తమ జాతి బిడ్డను కాపాడుకోవడానికి బ్రిటిష్ వారిపై జంతువులతో దాడి చేసే సీన్ అయితే నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది. ట్రక్ లో నుంచి పులులు, సింహాల మధ్య దూకే సీన్.. ఎన్టీఆర్ ఎలివేషన్ మాములుగా ఉండదు. పర్టిక్యులర్ గా ఈ ఒక్క సీన్ సినిమా మొత్తానికి ప్రాణం పోసిందని నార్త్ ఇండియన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఏడాది బెస్ట్ ఎలివేషన్ సీన్ అంటే ఇదేనని అభిమానులు బల్లగుద్ది చెప్పుకొస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ కు సపోర్ట్ చేయడం విశేషం.