యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ బ్లాక్ ని ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ గ్యాప్ లో, రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప 2’ సెట్స్ కి వెళ్లాడు ఎన్టీఆర్. పుష్పరాజ్ ని కలవడానికి వెళ్లిన ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫాన్స్. ఎన్టీఆర్ వైట్ షర్ట్ లో, కూల్ గా నడుస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు ‘బావా’, ‘బావా’ అని పిలిచుకుంటారు. ఈ మధ్య ఉన్న రిలేషన్షిప్ అల్లు అర్జున్ బర్త్ డే రోజున అల్లు-నందమూరి మ్యూచువల్ ఫాన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చింది.
Read Also: Trivikram: రుకో జరా… సబర్ కరో… మే 31 హమ్ బాంబ్ లగాదేంగే
రెండు రోజుల పాటు ‘బావా’ అనే ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారు అంటే ఎన్టీఆర్-అల్లు అర్జున్ మ్యూచువల్ ఫాన్స్ ఎంత వైల్డ్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. డైరెక్టర్ సుకుమార్ కూడా ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ని మోస్ట్ స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన సుకుమార్ మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తాడు అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు సుకుమార్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు కలిసి దిగిన ఒక ఫోటో బయటకి వస్తే చాలు సోషల్ మీడియాలో సునామీ రావడం గ్యారెంటీ. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు మాత్రమే ఉన్న ఫోటో ఒక్కటి బయటకి వచ్చినా ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడం పక్కా.