ఇద్దరు యువ హీరోల మధ్య ఊహించని విధంగా మరోసారి క్లాష్ ఏర్పడింది. గతేడాది ఓ సారి బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డ వీరిద్దరూ మరోసారి సమరానికి సై అంటున్నారు. వారే నాగశౌర్య, శ్రీసింహా. లాస్ట్ ఇయర్ కొద్దిగా పై చేయి అనిపించుకున్న నాగశౌర్య ఈ సారి సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తుంటే తొలి సినిమా తర్వాత విజయం లేని శ్రీసింహా ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తున్నాడు. నిజానికి ప్రస్తుతం వారానికి నాలుగైదు స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. దాంతో సహజంగానే యంగ్ హీరోస్ చిత్రాల మధ్య క్లాష్ తప్పటం లేదు. ఇక శౌర్య ప్రస్తుతం ‘రంగబలి’ అనే సినిమా చేస్తున్నాడు. పవన్ బాసంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చెరుకూరి సుధాకర్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా ఇందులో హీరోయిన్. ఈ సినిమాను జూలై 7న రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ‘మత్తువదలరా’తో హీరోగా మారిన కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన తాజా చిత్రం ‘భాగ్ సాలే’. నేహా సోలంకీ హీరోయిన్ గా నటించిన సినిమాకు ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీని అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా జూలై 7న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు శనివారం ఎనౌన్స్ చేశారు. సో… నాగశౌర్య ‘రంగబలి’తో శ్రీ సింహా ‘భాగ్ సాలే’ బాక్సాఫీస్ బరిలో పోటీ పడనుందన్న మాట. నిజానికి ఈ ఇద్దరు యువ హీరోల సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడటం కొత్త కాదు. గత యేడాది సెప్టెంబర్ 23న వీరు నటించిన సినిమా ఒకేసారి వచ్చి పోటీ పడ్డాయి. నాగశౌర్య సొంత సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’ విడుదలైన రోజ శ్రీ సింహా ‘దొంగలున్నారు జాగ్రత్త’ రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద నాగశౌర్య సినిమా కొంచె బెటర్ రిజల్ట్ ను సాధించింది. మరి ఏడాది ఎవరిది పై చేయి అవుతుంది? ఏ హీరో సినిమా విజయాన్ని సాధిస్తుందన్నది చూడాలి.