ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, ఇండియన్ బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్ ని తగ్గట్లు యాక్షన్ మూవీస్, పీరియాడిక్ వార్ డ్రామా, మైథాలజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి డార్లింగ్-మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాల తరహాలో హిట్ అయిన లవ్ స్టోరీ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్… త్వరలో ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాల్లో ది బెస్ట్‌గా నిలిచింది ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా.. హను రాఘవూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.
సీతారామం రిలీజ్ తర్వాత గత ఏడాదిన్నర ఏ సినిమాని అనౌన్స్ చేయకుండా ప్రభాస్‌తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు హను రాఘవపూడి. ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో జరిగే కథని హను, ప్రభాస్ కోసం రాసాడని సమాచారం. యుద్ధంలో పుట్టే ప్రేమ కథ, యుద్ధ వీరుడి ప్రేమ కథ లాంటి ఎలిమెంట్స్ తో హను కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ డిసెంబర్ నుంచి హను రాఘవపూడి సినిమాకి ప్రభాస్ డేట్స్ కూడా కేటాయించాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రభాస్ పక్కన యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుందట. శ్రీలీల ని హీరోయిన్ గా ఫైనల్ చేసారని సమాచారం, అయితే ఈ విషయం అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకూ రూమర్ గా మాత్రమే చూడాలి. ఒకవేళ శ్రీలీలా హీరోయిన్ గా ఫైనల్ అయినా కూడా ప్రభాస్ లాంటి కటౌట్ ముందు సరిపోతుందా అనేది కూడా ఆలోచించాలి.