Yash Comments on the delay in his upcoming film: KGF సిరీస్ కారణంగా కన్నడ స్టార్ హీరో యష్‌కి అద్భుతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యష్ అంటే ఎవరో పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం తెలియదు కానీ ఈ కేజిఎఫ్ సిరీస్ మాత్రం ఆయనకు ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ KGF 2 వంటి భారీ విజయం తర్వాత, ఈ స్టార్ హీరో తన తదుపరి సినిమా ఏమిటి అనే విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఒక ఇది అతని అభిమానులను నిరాశపరిచింది. ఆయన చేయబోయే తదుపరి సినిమా గురించి చాలా పుకార్లు ఉన్నప్పటికీ, అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న యష్ తన రాబోయే సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలను వెల్లడించారు. KGF 2 తర్వాత, యష్ నుండి అధికారికంగా ఏ సినిమా ప్రకటించబడలేదు. నిజానికి KGF 2 విడుదలై 20 నెలలు దాటింది, ఆ ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయని యష్ అన్నారు.
Michael : సందీప్ కిషన్ ‘మైఖేల్’ టెలివిజన్ ప్రీమియర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
మలయాళ దర్శకుడు గీతు మోహన్‌దాస్‌తో ఆయన సినిమా ఉంటుందని అంటున్నారు కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అంతేకాదు రాముడిగా నటించే రణబీర్ కపూర్‌కు విలన్ గా యష్ రామాయణంలో రావణుడి పాత్రను పోషిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక యష్ ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరై తన తదుపరి చిత్రం ఆలస్యం కావడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ క్రమంలో తాను రిలాక్స్ కావడం లేదని, తాను ఏదైనా చేస్తున్నానంటే అదంతా తన అభిమానులు తనకు ఇచ్చిన ధైర్యమేనని అన్నారు. తన అభిమానులకు సగం వండిన ఆహారాన్ని అందించడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. అందరూ గర్వించేలా తాను సినిమా చేస్తానని, అయితే అందుకోసం ఓపిక పట్టాలని కోరారు. యష్ గీతూ మోహన్‌దాస్ తోనే సినిమా చేస్తున్నట్టు వార్తలు ఉన్నాయి. ఇక సినిమా అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మీద మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.