Yash: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారాడు కన్నడ నటుడు యష్. ఈ సినిమా కేవలం అతనిని స్టార్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఒక్క సినిమాతో.. ఆ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న యష్.. కెజిఎఫ్ తరువాత టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక యష్ సినిమాల గురించి పక్కన పెడితే.. వ్యక్తిగతంగా అతడు ఎప్పుడు సింపుల్ లైఫ్ నే ప్రిఫర్ చేస్తాడు. భార్య, కూతురు, కొడుకుతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇక తన తండ్రి ఒక బస్సు కండక్టర్. అతను ఇంత సంపాదించినా కూడా తన తండ్రి తన ఉద్యోగం మానలేదని, ఆయన వ్యక్తిత్వమే తనకు వచ్చిందని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. యష్ అలా చెప్పడం మాత్రమే కాకుండా చేసి చూపిస్తూ ఉంటాడు.
తాజాగా యష్.. ఒక చిన్న కిరాణాకొట్టులో సందడి చేశాడు. యష్ ఒక్కడే కాదు.. అయన భార్య, పిల్లలు కూడా ఆ కొట్టుకు వచ్చి.. వారికి కావాల్సినవన్నీ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి ఉత్తర కర్ణాటక జిల్లా భత్కల్లోని షిరాలీకి వెళ్లి చిత్రపుర మఠాన్ని సందర్శించుకుని తిరిగి వస్తుండగా.. ఒక చిన్న కిరాణా కొట్టు వద్ద ఆగారు. ఇక అక్కడ తన భార్య, పిల్లలకు ఐస్ క్యాండీలు, చాక్లెట్స్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతపెద్ద హీరో .. ఇలా కిరాణా కొట్టు దగ్గర ఆగడంతో ప్రజలు సెల్ఫీలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.