Yandamuri Veerendranath Release Mudu Chepala Katha poster :యండమూరి విడుదల చేసిన ‘మూడు చేపల కథ’ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yandamuri Veerendranath Release Mudu Chepala Katha poster
‘సమంత’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం ‘మూడు చేపల కథ’. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా ముఖేష్ కుమార్ రూపొందిస్తున్న ‘మూడు చేపల కథ’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. యండమూరి నవలలు చదువుతూ పెరిగి, ఆయన ఇచ్చిన ప్రేరణతో రచయిత అయి దర్శకుడిగా మారిన తను దర్శకత్వం వహించిన మూవీ ఫస్ట్ లుక్ యండమూరి ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. ఏపీలోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తన రెండవ చిత్రాన్ని తెరకెక్కించానని ముఖేష్ తెలిపారు. ప్రముఖ ఆర్జే లక్ష్మీ పెండ్యాల,, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, దర్శకత్వ శాఖకు చెందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్ డాక్టర్ కల్యాణ్, సుభాష్ ఘయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక భాగం షూటింగ్ అనంతపురంలో జరుపుకున్న ఈ చిత్రం పోస్టర్ ను ప్రముఖ యాంకర్ రమేష్ అనంతపురంలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పృథ్వి, అర్షద్ షేక్, బాలాజీ, సాయినాథ్, హర్ష, రెహ్మాన్, అనంతనేని గోపాలకృష్ణ, యాంకర్ సత్తెన్న, ధీరజ అప్పాజీ, శేషు కుమార్, ముఖేష్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read
తాజావార్తలు
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు..
-
Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్‌కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!