Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్‌పై కేసు నమోదు!
- తెలుగు సినీ పరిశ్రమలో వెలుగులోకి మరో సంచలన విషయం
- హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం
- 'భాగమతి' డైరెక్టర్ అశోక్ బాబుపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagamathi Director Gudluri Ashok Babu Case: తెలుగు సినీ పరిశ్రమలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలతో ప్రముఖ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో నిర్మాత విజయలక్ష్మిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. బాధిత యువకుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
తన కుమారుడిని సినీ హీరోగా పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు.. పలు దఫాలుగా మొత్తం రూ.3.5 కోట్లను తీసుకున్నారని హనుమంతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మాట ఇచ్చినట్లుగా సినిమాను ప్రారంభించకపోవడమే కాకుండా.. తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మిని విచారణకు ఆదేశించారు. డబ్బు లావాదేవీలు, సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు, ఇతర ఆధారాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read
గుడ్లూరి అశోక్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశరామన్న’, ‘పిల్ల జమీందార్’, ‘భాగమతి’ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. అలాంటి దర్శకుడిపై ఇప్పుడు ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. ఆరోపణలపై దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మి ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!