Pawan Kalyan: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు ఫేమస్ అవ్వాలని చూసేవారే. దాని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వీడియోలు, స్టంట్లు, విమర్శించడాలు, సినిమా రీల్స్ చేయడాలు.. అబ్బో ఒకటి అని చెప్పలేం. ఇక వారు ఎందుకు ఫేమస్ అయ్యారో కొంతమందికి అర్ధమే కాదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొంతమంది హీరోలు, డైరెక్టర్లు మోసం చేసారని, అవకాశాల కోసం లైంగిక వేధింపులకు గురిచేశారని మీడియా ముందు మాట్లాడి ఫేమస్ అవుతున్నారు. అయితే అందులో నిజం ఎంత..? అబద్దం ఎంత..? అనేది ఆ దేవుడికే తెలియాలి. ఒక శ్రీ రెడ్డి, సునీత బోయ, కల్పిక గణేష్ ఇలా ఫేమస్ అయినవారే. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంటివద్ద ఒక మహిళ ఆందోళన చేయడం నెట్టింట వైరల్ గా మారింది.
రెండు రోజుల క్రితం ఒక మహిళా పవన్ ఇంటివద్ద ఆందోళన చేస్తూ కనిపించింది. పవన్ ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని చెప్పుకొచ్చింది. అయితే సెక్యూరిటీ సదురు మహిళపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక పోలీసుల విచారణలో ఆమె తమిళనాడుకు చెందిందని, ఆమెకు మతిస్థిమితం లేదని తెల్సింది. అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమెకు మతిస్థిమితం లేకపోతే కరెక్ట్ గా పవన్ ఇంటివద్ద కు వెళ్లి పవన్ ను కలవాలనిఎలా తెలుసు..? తమిళనాడుకు చెందిన ఆమెకు పవన్ గురించి, హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటి గురించి అంత స్పష్టంగా ఎలా తెలుసు..? ఆమెను ఎవరైనా కావాలనే పంపారా..? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్నే పవన్ ఇంటివద్ద ఒక బ్లాక్ కారు ఆగి ఉండడం, వారో బౌన్సర్లను కొట్టడం జరిగాయి. అసలు పవన్ వెనుక ఏం జరుగుతోంది..? అనేది ఇప్పటికి మిస్టరీగా మారింది.