Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన యశోద నేడు థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. హరి- హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమను తెరకెక్కించారని ఒక ఊహతో థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు బిగ్ ట్విస్ట్ గా కాస్మొటిక్ మాఫియాను చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు దర్శకులు. ఇకపోతే మొదటి రోజు హౌస్ ఫుల్ తో యశోద కొనసాగుతోంది. ఇక ముందు ముందు కూడా ఇదే వేగంతో సినిమా కొనసాగవచ్చు అని పలువురు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం సినిమ కంటెంట్ బావుండడంతో పాటు సామ్ పై సానుభూతి కూడా అని అంటున్నారు.
గత కొన్నిరోజులుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా రిలీజ్ కు కొన్నిరోజుల ముందే ఆమె హాస్పిటల్ లో చికిత్స కోసం చేరింది. అంత బాధలోనూ ఆమె సినిమాకు డబ్బింగ్ చెప్పింది, ప్రమోషన్స్ కు హాజరయ్యింది. ఇక ప్రమోషన్స్ లో తన వ్యాధి గురించి, ఆమె పడుతున్న బాధ గురించి చెప్పి కన్నీటిపర్యంతమయ్యింది. ఇక సామ్ ఎమోషనల్ అవ్వడం చూసిన ప్రతి ఒక్కరు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఇదే సానుభూతి యశోద సినిమాపై ప్రభావం చూపొచ్చు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అందుకు నిదర్శనమే.. సోషల్ మీడియాలో ఇప్పటివరకు సామ్ పై కానీ, సినిమా గురించి కానీ ఒక్క నెగెటివ్ కామెంట్ రాకపోవడం. మరి ఇది సానుభూతినా..? లేక ఈ సమయంలో ట్రోల్ చేస్తే బాగోదని ట్రోలర్స్ ఆలోచిస్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా సమంత వ్యాధి.. యశోదకు కూడా బాగానే కలిసివచ్చేలా ఉందని తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎన్ని కలక్షన్స్ రాబడుతుందో చూడాలి.