Jayakrishna: ఈ ఏడాది మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు తో పాటు తల్లి ఇందిరాదేవిని ఇటీవల తండ్రి హీరో కృష్ణను కోల్పోయాడు. ఇక మహేశ్ బాబు కంటే హీరోగా పరిచయం అయిన రమేశ్ బాబు ఎందుకో ఏమో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయినా అక్కడా యాక్టీవ్ గా నిర్మాణం చేపట్టలేదు. అయితే రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చిన్నప్పుడు బాలనటుడుగా తన బాబాయ్ మహేశ్ బాబు సినిమా ‘నిజం’లో మెరిశాడు. ఆ తర్వాత చదువుమీద దృష్టి పెట్టిన జయకృష్ణ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. తాత కృష్ణ అకాల మరణంతో అంత్యక్రియలకు కూడా అందుకోలేక పోయాడు. అయితే చిన్నదినం రోజున అందరి దృష్టి జయకృష్ణపైనే పడింది.
మహేశ్ కి సమానమైన హైట్ తో చక్కటి పర్సనాలిటీతో ఉన్న జయకృష్ణ సినిమాలలో నటిస్తాడా? అనే ఆరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఘట్టమనేని కుటుంబం నుంచి పలువురు చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి ఉన్నారు. వారిలో కృష్ణ అల్లుడు సుధీర్ బాబు మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణను మహేశ్ హీరోగా పరిచయం చేస్తారేమో అని పలువురు దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయతే జయకృష్ణ ప్రస్తుతం చదువుకుంటున్నాడు కావున అది పూర్తి కాగానే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.