వేదం తర్వాత క్రిష్- అనుష్క మూవీలో వస్తోన్న ఫిల్మ్ ఘాటీ. దాదాపు 15 సంవత్సరాల తర్వాత కొలబరేట్ కావడంతో భారీ అంచనాలున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న సౌత్ క్వీన్‌కు.. కొండ పొలం ప్లాప్ తర్వాత హరి హర వీరమల్లు సగం టేకింగ్ చేసి ఈ ప్రాజెక్ట్‌కు షిఫ్టైన క్రిష్‌కు మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఈ ఇద్దరికే కాదు.. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ ప్రభుకు కూడా క్రూసియల్ మూవీ. లెజెండరీ హీరో శివాజీ గణేశన్ మనవడైనా, సీనియర్ హీరో ప్రభు కొడుకైనా.. తనకంటూ ఓన్ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నాడు.
Also Read : Kollywood : మలేషియాలో స్టార్ హీరో సినిమా ఆడియో లాంచ్.. ఎప్పుడంటే
తమిళంలో కుంకీతో కెరీర్ స్టార్ట్ చేసిన విక్రమ్ ప్రభు.. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ చూడలేదు. పొన్నియన్ సెల్వన్‌లో నటించినా.. క్రెడిట్ మణిరత్నం ఖాతాలోకి చేరిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఇరుగుపట్రు మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్లీ టాలీవుడ్ ఫిల్మ్ అశోక వనంలో అర్జున కళ్యాణం రీమేక్ చేయగా.. సోసో అనిపించుకుంది. టాలీవుడ్‌లో మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు విక్రమ్ ప్రభు. ఇందులో దేశీ రాజుగా కనిపించబోతున్నాడు. తనకన్నా అనుష్క పాత్రకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని తెలిసి కూడా యాక్ట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఘాటీతో టాలీవుడ్ కన్నా కోలీవుడ్‌లో బిగ్ ఛాలేంజ్ ఎదుర్కొవలసి ఉంటుంది ఈ స్టార్ కిడ్. ఈ బొమ్మ వస్తోన్న అదే సెప్టెంబర్ 5న ఇక్కడ మిరాయ్‌తో పాటు తమిళంలో త్రీ ఫిల్మ్ పోటీపడుతున్నాయి. ముఖ్యంగా శివకార్తీకేయన్- మురుగుదాస్ మదరాసితో టఫ్ ఫైట్ తప్పేట్లు లేదు. ఇక వివాదాస్పద మూవీ బ్యాడ్ గర్ల్, విజయ్ ఆంటోనీ శక్తి తిరుమగన్ చిత్రాలున్నాయి. వీటన్నింటితో ఘాటీ పోటీ పడాలంటే కేవలం హీరో, దర్శకుడు ప్రమోషన్ చేస్తే సరిపోదు. అనుష్క రంగంలోకి దిగాల్సిందే. ఎక్కడా ఈ మధ్య కాలంలో కనిపించని స్వీటీ రెండేళ్లుగా హిట్ చూడని హీరో కోసం బయటకొస్తుందా అనేది క్వశ్చన్ మార్క్.