Beast: తెలుగు వారంటే అంత చులకనా.. విజయ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ అన్ని చోట్లా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. అయితే విజయ్ మాత్రం కోలీవుడ్ కి మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నాడట. తెలుగు ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వనని చెప్తున్నాడట. దీంతో విజయ్ మాట కాదనలేక డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, హీరోయిన్ పూజా హెగ్డేతో తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీంతో తెలుగు ప్రేక్షకులు హర్ట్ అవుతున్నారు. విజయ్ కు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
పోలీసోడు సర్కార్ అదిరింది మాస్టర్ వంటి చిత్రాలకు తెలుగులో మంచి వసూళ్లు దక్కాయి. దీంతో బీస్ట్ సినిమాపై కూడా తెలుగు అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అంతటి అభిమానం చూపిస్తున్నా కూడా విజయ్ తెలుగువారిని చులకనగా చూస్తున్నాడని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర భాషలకు చెందిన హీరోలు తెలుగులో తమ సినిమా రిలీజ్ అవుతోందంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న తరుణంలో విజయ్ ప్రమోషన్స్ కి రాను అని చెప్పడం తెలుగు వారిని అవమానించడమే అని వారు అంటున్నారు. ఇక ఇటీవలే తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. మరి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నా విజయ్ ఇలా చేయడం పద్దతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో చూడాలి.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!