Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా అందులో వివాదం ఉండాల్సిందే. చేసే సినిమా అయినా, మాట్లాడే మాట అయినా వివాదం లేకపోతే ఆయనకు ముద్ద దిగదు. ఇక వర్మ సినిమాలు అంటే.. ఒకప్పుడు సాలిడ్ యాక్షన్ హిట్స్ అనేవారు ఇపుడు చెత్త సినిమాలు అంటూ పెదవి విరుస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రాజకీయ నేతల బయోపిక్స్ తో రచ్చ చేసినా వర్మకు మాత్రం ఒక రూపాయి వచ్చింది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా వర్మ మరో సంచలనానికి తెరతీస్తునట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం నేడు వర్మ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడమే. సడెన్ గా జగన్ తో మీటింగ్ ఏంటీ..? ఎందుకు..? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడు గంటల జరిగిన ఈ మీటింగ్ లో సినిమాల గురించే వర్మ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం ఎంతటి రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నవాడు రాజకీయాలకు పనికిరాడని, భార్యలనే సరిగ్గా చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవలే మంగళగిరి మీటింగ్ లో ఆ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. మునెప్పుడు లేనివిధంగా పవన్ కోపాన్ని చూశారు ప్రజలు. ఇక ఇదంతా స్టోరీగా చేసుకొని వర్మ సినిమాగా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి, అందుకే వర్మ, జగన్ ను కలిసి ఈ స్టోరీని వినిపించాడట. ఇప్పటికే పవన్ పై వర్మ రెండు సినిమాలు తీశాడు. ఇక ఎన్నికల సమయంలో పవన్ ను టార్గెట్ చేయడానికి వర్మ ఇలాంటి ప్లాన్ వేసినట్లు జనసేన అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరిఇందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.