OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఈవెంట్ లో హుషారెత్తించారు. ఆయన ఎంట్రీతోనే ఓజీ లుక్ తో వచ్చారు. కత్తి పట్టుకుని వచ్చి అందరినీ హుషారెత్తించారు. ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎక్కువసేపు మాట్లాడలేదు. సాధారణంగా తన సినిమాల ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎంత లేదన్నా అరగంట మాట్లాడుతుంటారు. అందులో ఎక్కువ సేపు సినిమాలో పాత్రలు, సినిమా ప్రాముఖ్యత గురించే మాట్లాడేవారు. కానీ ఓజీ ఈవెంట్ లో అలా చేయలేదు.
Read Also : Thaman : వర్షమా బొక్కా.. తమన్ ఏంటీ కామెంట్లు
అఫ్ కోర్స్.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదనుకోండి. కానీ పవన్ కల్యాణ్ మరో ఈవెంట్ పెడుతారనే నమ్మకం లేదు. ఇదే ఫైనల్ ఈవెంట్ కావచ్చు. మరి అలాంటప్పుడు పవన్ కల్యాణ్ ఈ సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడి ఊరుకోవడం ఎందుకు అంటే.. సినిమా మీద ఇంతకంటే హైప్ పెంచడం పవన్ కు ఇష్టం లేదు. ఫ్యాన్స్ అంచానాలు మితిమీరిపోతే అది ప్రమాదం అని గుర్తించారు. అందుకే ఓజీ గురించి పెద్దగా మాట్లాడకుండా ఎక్కువసేపు సుజీత్, తమన్, ప్రొడ్యూసర్ గురించే మాట్లాడారు.
Read Also : OG : సుజీత్ తో సినిమా చేయడానికి కారణం ఆ డైరెక్టరే : పవన్