OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో పవన్ చాలా జోష్ గా మాట్లాడారు. కత్తి పట్టుకుని ఓజీ డ్రెస్ లో ఈవెంట్ కు వచ్చారు. వపన్ మాట్లాడుతూ.. సుజీత్ తో సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను నాకు పెద్ద అభిమాని. జానీ సినిమా చూసి హెడ్ కు బ్యాండ్ కట్టుకుని నెల రోజులు విప్పలేదు. అప్పటి నుంచే సినిమాలు తీయాలనుకున్నాడు. రన్ రాజా రన్ సినిమా తీసిన తర్వాత.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు సుజీత్ గురించి చెప్పాడు.
Read Also : OG : జానీ సినిమా చూసి సుజీత్ అలా చేశాడు.. పవన్ కామెంట్స్
సాహో సినిమా తర్వాత సుజీత్ తో సినిమా తీస్తే బాగుంటుందని త్రివిక్రమ్ నాకు చెప్పాడు. అప్పుడే నాకు సుజీత్ ను పరిచయం చేశాడు. సుజీత్ పనితనం గురించి తెలుసుకున్న తర్వాత సినిమా ఓకే చేశాం. అతను కథ చెప్పేది చాలా తక్కువ. ముక్కలు ముక్కలుగా కథ చెప్తాడు.. కానీ సినిమాలో చాలా ఎక్కువగా చూపిస్తాడు. అందుకే అతని మేకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ తెలిపాడు పవన్ కల్యాణ్. సుజీత్ తో సినిమా చేశాక నేను కూడా అతని మాయలో పడిపోయా. నేను డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోయి సినిమా కోసం పనిచేశా అంటూ తెలిపారు పవన్ కల్యాణ్.
Read Also : Tamannaah : ఒక్క సాంగ్ కోసం తమన్నా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?