‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కి ముందే కాదు రిలీజ్ తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తొలిరోజు వసూళ్ళ గురించి మలిరోజు ప్రముఖుల ట్వీట్స్ తో మీడియా వారిని తమ వైపు తిప్పుకునేలా చేసిన యూనిట్ ఇప్పుడు విమర్శలతోనూ తడిసి ముద్దవుతోంది. అందులో కొన్ని సద్విమర్శలు కాగా మరి కొన్ని గాసిప్స్. ఇక గాసిప్స్ లో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటో చూద్దాం…
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, వారి కుటుంబ సభ్యులు, అనుష్క, సాయి కొర్రపాటి వంటి వారు సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత డివివి దానయ్య హోస్ట్ చేసిన ప్రత్యేక పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీ తాలూకు పిక్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించకపోవడంతో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అదేంటంటే ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌కి పెద్ద పాత్ర లభించి తనకు చిన్న పాత్ర లభించిందంటూ ఆడియన్స్ లో ప్రచారంలో ఉందని ఎన్టీఆర్ కలత చెందాడని అందుకే పార్టీకి డుమ్మా కొట్టాడనే పుకార్లు తీవ్రంగా వ్యాప్తి చెందాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని సన్నిహిత వర్గాలంటున్నాయి. ఎందుకంటే తొలి భాగంలో ఎన్టీఆర్ ఆధిపత్యం ఉంటే ద్వితీయార్థంలో చరణ్ ఆధిపత్యం ఉంటుంది తప్ప ఎవరినీ తక్కువ చేయలేదని, ఇద్దరికి రాజమౌళి సమ న్యాయం చేశాడని అంటున్నార. ఇక సక్సెస్ పార్టీకి ఎన్టీఆర్ రాకపోవడానికి కూడా కారణం ఉంది. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజును జరపడంలో బిజీగా ఉన్నాడు, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రచారంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ భార్య, పిల్లలతో గడపటానికి సమయం దొరకలేదు. అదీ కాక సక్సెస్ పార్టీ జరిగిన రోజే భార్య పుట్టిన రోజు కావటంతో సక్సెస్ పార్టీకి డుమ్మా కొట్టినా… అదేరోజు సాయంత్రం, ప్రణతి, చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించాడు ఎన్టీఆర్. ఆ వేడుకలో రాజమౌళి, రామ్ చరణ్ తో ఎన్టీఆర్ చేసిన సండది పిక్స్, వీడియోల రూపంలో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి కూడా. ఏది ఏమైనా తనపై వచ్చిన పుకార్లకు ఆ వీడియోలతో చెక్ పెట్టాడు జూనియర్.