టాలీవుడ్లో రాశీ ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ దాటింది. ఊహాలు గుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ డిల్లీ డాళ్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. తనతో పాటు టూ, త్రీ ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోలతో నటిస్తే మేడమ్ ఖాతాలో తారక్ తప్ప మరో టైర్ వన్ హీరో లేడు. ఎక్కువగా టైర్ 2, మిడిల్ రేంజ్ హీరోలతోనే జోడీ కట్టింది భామ.
Also Read : Vishwambhara : చిరుతో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయనున్న ‘నిశ్విక నాయుడు’
కెరీర్ స్టార్టింగ్‌లో రాశీ ఖన్నా బొద్దుగుమ్మగా విమర్శలు ఎదుర్కొనడంతో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదన్న వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఫిజిక్‌పై కాన్సట్రేషన్ చేసి తగ్గినప్పటికీ పెద్దగా ఒరింగిందేమీ లేదు. అలాగే సక్సెస్ రేష్యో కూడా తక్కువ ఉండటంతో పాటు గ్లామర్ రోల్స్ చేయకపోవడం కూడా స్టార్ హీరోల సరసన జోడీ కట్టే ఛాన్సులు రాశీ వద్దకు రాలేదని టాక్. తమిళ్, హిందీ పరిశ్రమలను చుట్టేసినా ఇదే సిచ్యుయేషన్. టాలీవుడ్లో ఎన్నో హోప్స్ పెట్టుకున్న ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో మేడమ్ తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్‌ను దూరం పెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సీడ్ అయ్యింది రాశీ. తిరు, సర్దార్, ఆరణ్మనై చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ అగత్యా ప్లాప్ కావడంతో మరో కోలీవుడ్ ఆఫర్ నిల్. అటు హిందీలో చేసిన టూ ఫిల్మ్స్ యోధ, సబర్మతి ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ బాంబ్స్‌గా మారాయి. ప్రజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు తెలుగు మూవీ తెలుసు కదా చేస్తోంది. ఈ సినిమాలతో అయిన రాశి హిట్ కొడుతుందేమో చూద్దాం.