మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా సాంగ్ మినహా వర్క్ మొత్తం ఫినిష్ అయింది.
Also Read : HHVM : స్టార్ హీరో బ్యానర్ పై హరహర వీరమల్లు కేరళ రిలీజ్
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాంగ్ ను ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ కోసం కీరవాణిని కాదని భీమ్స్ సిసిరోలియోను రంగంలోకి దింపారు మేకర్స్. చిరు కోసం ఓ స్పెషల్ మాస్ బీట్ ను రెడీ చేసాడు. సినిమాలో ఈ సాంగ్ చాలా కీలకం కాబోతుందని ఈ సాంగ్ లోని స్టెప్పులు వింటేజ్ చిరును గుర్తుచేసేలా కంపోజ్ చేస్తున్నారని సమాచారం. అయితే చిరు సరసన స్టెప్పులేసేది ఎవరనే దానిపై అనేక పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. తెలిసిన సమాచారం మేరకు ఈ స్పెషల్ లో నిశ్విక నాయుడు అనే కన్నడ భామను ఫిక్స్ చేశారు. గతంలో ప్రభుదేవతో కలిసి ఓ సాంగ్ లో డాన్స్ అదరగొట్టిన నిశ్విక ఇప్పుడు చిరుతో చిందేయబోతుంది. చిరు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ వేరు. ఖైదీ నంబర్ 150 రాయ్, వాల్తేర్ వీరయ్యలో ఊర్వశి రౌతేలా అదరగొట్టారు. మరి ఇప్పుడు కన్నడ హాట్ నిశ్విక ఏ రేంజ్ లో చిరుతో డాన్స్ చేస్తుందో చూడాలి.