ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సుధాకర్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి సారి రామ్ బై లింగువల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని మరో సాంగ్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. విజిల్.. విజిల్.. విజిల్ అంటూ సాగే ఈ గీతం అందరి చేత విజిల్ వేయించేలా కనిపిస్తోంది. నాలుకిట్ట మడతపెట్టి.. వేళ్లు రెండు జంటపట్టి .. ఊదు మరి దమ్మే పట్టి అంటూ మొదలైన ఈ సాంగ్ ఆద్యంతం జోరుగా సాగింది.
దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ ను చూపించాడు. ఒక ఫోక్ సాంగ్, పార్టీ సాంగ్ మిక్స్ చేసినట్లు మ్యూజిక్ దద్దరిల్లిపోయింది. ఇక సాహితీ రాసిన క్యాచీ లిరిక్స్ ను సింగర్స్ ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ అద్భుతమైన వాయిస్ తో పాడి మెస్మరైజ్ చేశారు. ఇక జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, కృతి శెట్టి వేసిన స్టెప్స్ ఈ సాంగ్ కు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఫ్లోర్ స్టెప్స్ నిజంగానే అభిమానుల చేత విజిల్స్ కొట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. జూలై 14 న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా.. అతనికి ధీటైన విలన్ పాత్రలో మరో యంగ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. మరి ఈ చిత్రంతో రామ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.