బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గద్దర్ -2 తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసాడు. ఓ మోస్తరు అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తో సన్నీ డియోల్ గోల్డెన్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు దాదాపు రూ. 700 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.
Also Read : Coolie : పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఫినిష్
వీరసింహ రెడ్డి హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ హీరోగా ‘JAAT’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు మేకర్స్. ఈ నెల 22న నార్త్ ఇండియా జైపూర్ లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో లో సాయంత్రం 5 గంటలకు జాట్ ట్రైలర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.