నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. శ్రీ కృష్ణుడు రాజ్యమేలిన ద్వారక నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. సముద్రగర్భంలో మునిగిపోయిన ద్వారక పట్టణ చరిత్రను ఈ చిత్రంలో దర్శకుడు చందు మొండేటి సృజించాడు. గతంలోనూ కోడి రామకృష్ణ ఇదే తరహా కథాంశంతో ‘దేవిపుత్రుడు’ మూవీ తీశాడు. శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం ద్వారక సముద్రంలో మునిగిపోయిందనేది వాస్తమనే విషయం ఆర్కియాలజీ సంస్థ వారు ప్రకటించారు.
తాజాగా తమ ‘కార్తికేయ -2’ చిత్ర బృందానికి శ్రీకృష్ణుడు జన్మించిన మధురలోని ఇస్కాన్ సంస్థ నుండి ఆహ్వానం వచ్చిందని హీరో నిఖిల్ తెలిపాడు. ‘కార్తికేయ -2’ సినిమా మోషన్ పోస్టర్, టీజర్ చూసిన ఆ సంస్థ నిర్వహకులు మధురలోని బృందావన ఇస్కాన్ మందిరానికి తమను ఆహ్వానించారని చెప్పాడు. మంగళవారం మధుర ఇస్కాన్ టెంపుల్ లో ‘కార్తికేయ -2’ సినిమాకు సంబంధించిన అన్ని భాషల టీజర్లను ప్రదర్శిస్తామని, అనంతరం కొత్త విడుదల తేదీనీ అక్కడే ప్రకటిస్తామని నిఖిల్ తెలిపాడు. సో… శ్రీ కృష్ణుడి జన్మస్థలం మధురలో ‘కార్తికేయ -2’ రిలీజ్ డేట్ ప్రకటన రేపు జరుగబోతోంది. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రను పోషించడం విశేషం.
A surprise invitation to team #Karthikeya2.
Watch this video for the details.
@actor_Nikhil @anupamahere @AnupamPKher @Actorysr @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 @innogenga pic.twitter.com/TlcEYkeRXJ— People Media Factory (@peoplemediafcy) July 18, 2022