Sreenath Bashi: మలయాళ స్టార్ హీరో శ్రీనాథ్ కేసు రోజురోజుకూ కఠినంగా మారుతోంది. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించిన యాంకర్ పై శ్రీనాథ్ అసభ్యకరమైన పదజాలంతో దూషించాడని, మహిళలను అనకూడని పదాలతో వేధించడాని ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. శ్రీనాథ్ పై యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఆడియో క్లిప్ ను కూడా సబ్మిట్ చేసింది. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన కొద్దిసేపటికే శ్రీనాథ్ బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇక ఈ విషయం ఇక్కడితో ముగుస్తుంది అనుకోలోపు ఇందులోకి డ్రగ్స్ కేసును ఇరికించారు కొంతమంది.. ఇంటర్వ్యూ జరిగే సమయంలో శ్రీనాథ్ డ్రగ్స్ తీసుకున్నాడని, అందుకే అతనికి తెలియకుండానే ఆ మాటలు మాట్లాడినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో అతడికి నార్కో టెస్ట్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. ఈరోజో, రేపో ఈ టెస్టులు చేయనున్నారట.
ఇక ఈ విషయం తెలియడంతో మలయాళ ఇండస్ట్రీ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనాథ్ ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వారిని ఎదగనియ్యకూడదని, డ్రగ్స్ కు ఎడిక్ట్ అవ్వడం, ఇలా పబ్లిక్ ముందు న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ తమ ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకువస్తాయని భావించిన మలయాళ ఇండస్ట్రీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక మరికొంతమంది ఈ ఘటనను.. హీరో దిలీప్ ఘటనతో పోలుస్తున్నారు. ఒక యాంకర్ ను తిట్టాడని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు.. ఒక నటి నిర్మొహమాటంగా తనను కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ప్రయత్నించారని కేసు పెడితే.. అతడు జైలు లో ఉంటూ, బెయిల్ పై బయటికి వచ్చి సినిమాలు తీస్తున్నాడు.. స్టార్ హీరోల ఫంక్షన్స్ కు వెళ్తున్నాడు. మరి అతనిని ఎందుకు బ్యాన్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే అతడికి బ్యాక్ గ్రౌండ్, డబ్బు ఉన్నాయని, ఇతడికి అవేమి లేవనేకదా అని చెప్పుకొస్తున్నారు.