ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. మొన్నటికి మొన్న ఆచార్య నైజాం అహక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా అతడికి నిరాశే మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక దీంతో వరంగల్ శ్రీను కు భారీ నష్టం వాటిల్లింది. ఇక ఒక్క సినిమాతోనే ఇతగాడి కెరీర్ ముగిసింది అనుకోనేలోపు మరో భారీ షాక్ ఇచ్చాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమా నైజాం హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురిచేశాడు.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగస్వామిగా మారడంతో హిందీలోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ పెరిగింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది. దీంతో వరంగల్ శ్రీను పంట పడింది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆచార్య తో నష్టాలు చవిచూసిన ఈ డిస్ట్రిబ్యూటర్ ను లైగర్ గట్టెక్కిస్తాడా..? లేక నిండా ముంచేస్తాడా..? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 25 న రిలీజ్ కానుంది.