Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. వాల్తేరు వీరయ్య వచ్చేది సంక్రాంతికే అని కన్ఫర్మ్ చేసేశారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. రవితేక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. మొదటి నుంచి ఈ సినిమా సంకాంత్రి రేసులో ఉంది అని చెప్పుకొస్తున్నారు కానీ, రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు.
ఇప్పటికే రేస్ లో ఉన్న వీరసింహ రెడ్డి, వారసుడు సైతం జనవరి 12 న వస్తున్నట్లు ప్రకటించాయి. కానీ, చిరు రిలీజ్ డేట్ ప్రకటించకపోయేసరికి సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలకు చెక్ పడుతూ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. చిరు కన్నా బాలయ్య ఒకరోజు ముందు వస్తున్నాడు. ఏదిఏమైనా ఈ సారి సంక్రాంతి రేసు మాత్రం అదిరిపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు.. ఇద్దరు స్టార్ డైరెక్టర్లు.. ఒక్కత్తే హీరోయిన్.. మరి ఏ హీరో సంక్రాతి మొగుడుగా ఫిక్స్ అవుతాడో చూడాలి.