Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర. ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి మీద భారీ షెడ్యూల్స్ చేశారు. ఈ మూవీ నుంచి ఓ భారీ అప్డేట్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కేన్స్ ఫెస్టివల్ లో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తారని అంతా అన్నారు. కానీ టీజర్ కు బదులు విశ్వంభర బుక్ ను రిలీజ్ చేశారు. ఈ పుస్తకాన్ని నిర్మాత విక్రమ్ తాజాగా విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ పంచుకుంది. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : IPL 2025 Playoffs: ముంబై రెండో స్థానానికి చేరుకుంటుందా?.. అవకాశాలు ఇవే!
‘విశ్వంభర మీ ముందుకు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని తీసుకొస్తోంది. ఇంతకీ ఆ బుక్ లో ఏముందో తెలియాలంటే వెయిట్ చేయండి’ అంటూ నిర్మాణ సంస్థ తెలిపింది. విశ్వంభరను దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా 13 సెట్లు వేసి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
ఈ స్థాయిలో గతంలో చిరంజీవి నటించిన ఏ సినిమాకు కూడా బడ్జెట్ పెట్టలేదు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీనుంచి కేవలం చిన్న గ్లింప్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఆ తర్వాత రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే మూవీ నుంచి టీజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Eluru Agency: ఆ ఎమ్మెల్యేకు నక్సలైట్ల ముప్పు..? పోలీస్ శాఖ సూచనలు..