Dhurandhar: పాకిస్తాన్‌లో ‘‘ధురంధర్’’ ట్రెండింగ్.. బ్యాన్ ఉన్నా తెగ చూస్తున్నారు..
- పాకిస్తాన్‌లో బ్యాన్ ఉన్నా, ధురంధర హవా..
- నెట్‌ఫ్లిక్స్ పాకిస్తాన్‌లో నెంబర్ వన్‌గా ధురంధర్ ట్రెండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar: ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ నటించిన ‘‘ధురంధర్’’ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే బాక్సీఫీస్ వద్ద రికార్డుల్ని కొల్లగొట్టిన ఈ మూవీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా ప్రేక్షకుడు విరగబడి చూస్తున్నారు. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌గా ఐఎస్ఐ, ఉగ్రవాదులు, మాఫియా, రాజకీయం ఎలా ముడిపడి ఉంటుందనే విషయాలను సినిమాలో చూపించారు. దీంతో పాకిస్తాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాలు ఈ సినిమాపై నిషేధాన్ని విధించాయి.
Read Also: Dhanush D55 Film: D55 క్రేజీ అప్‌డేట్.. ధనుష్ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు
Also Read
ఇదిలా ఉంటే, ధురంధర్‌ను పాక్ బ్యాన్ చేసినప్పటికీ అక్కడి పాక్ ప్రజలు మాత్రం ఎలాగోలా ఈ సినిమాను చూస్తున్నారు. ఇప్పటికే పైరసీ ఫ్రింట్‌లను రికార్డ్ స్థాయిలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ధురంధర్ నెట్‌ఫ్లిక్ పాకిస్తాన్‌లో నెంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఓటీటీలోకి జనవరి 30న వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ పై బ్యాన్ ఉన్నా కూడా పాక్ ఆడియెన్స్ మాత్రం ధురంధర్ సినిమాను తెగ చూసేస్తున్నారు.
ధురంధర్ రూ. 1000 కోట్లు సాధించిన సినిమాల క్లబ్‌లో చేరింది. ఈ రికార్డును ఇంతకు ముందు బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (రూ. 1,417 కోట్లు), KGF: చాప్టర్ 2 (రూ. 1,001 కోట్లు), పుష్ప 2: ది రూల్ (రూ. 1,471.1 కోట్లు) పేరిటి ఉన్నాయి. విషయం ఏంటంటే, కేవలం హిందీలోనే రిలీజైన ధురంధర్ రూ. 1000 కోట్లను కొల్లగొట్టడం మరో రికార్డ్. ధురంధర్-2 మార్చి 19, 2026లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
-
418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
-
Astrology: సెప్టెంబర్ 11 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికే డబ్బులే డబ్బులు..!
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?