Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నిత్యం వార్తల్లో ట్రెండింగ లో ఉంటుంది. జూన్ 27న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. మంచు విష్ణు చేస్తున్న పోస్టులు, ఇస్తున్న ఇంటర్వ్యూలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. తాజాగా కన్నప్ప గురించి మరో పోస్టు చేశాడు. ఇందులో ఇంకా ’28 రోజులే మిగిలి ఉంది. ఈ రోజు చెన్నైలో కన్నప్ప గర్జిస్తాడు. అక్కడ కొన్ని ఫుటేజ్ లను డిస్ ప్లే చేస్తాం. ఇప్పటి వరకు మీరు చూడని వాటిని చూపించబోతున్నాం’ అంటూ తెలిపాడు విష్ణు.
Read Also : PBKS vs RCB: ఇది మర్చిపోలేని రోజు.. అదే మా ఓటమిని శాసించింది: శ్రేయాస్
ఈ పోస్టు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తి, యాక్షన్ మీ హృదయాన్ని కదిలిస్తుంది అని తెలిపాడు. ఈ రోజు చెన్నైలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు మాత్రమే ఇప్పటి వరకు ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇందులో నటిస్తున్న ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ త్వరలోనే ప్రమోషన్లకు వస్తారని మూవీ టీమ్ అంటోంది.
కానీ వాళ్లు వచ్చేదాకా మూవీపై భారీ హైప్ పెరిగేలా కనిపించట్లేదు. కన్నప్ప హార్డ్ డిస్క్ పోయిందంటూ మొన్న పెద్ద ప్రచారమే జరిగింది. దానిపై ఇప్పటికే పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది టీమ్. మళ్లీ దాని గురించి అప్డేట్ అయితే బయటకు చెప్పలేదు. దాన్ని సెటిల్ చేసుకున్నారని అంటున్నారు.
Read Also : Allu Arjun : విమర్శలకు అవార్డులే సమాధానాలు.. బన్నీ తగ్గేదే లే..
Only 28 days left!
Today, Kannappa roars through the streets of Chennai. Showing the unseen footage to Tamil Media.
Devotion, action, and a story that will move your soul, on June 27th#Kannappa #HarHarMahadev
— Vishnu Manchu (@iVishnuManchu) May 30, 2025