Kannappa: యూట్యూబ్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అయింది. గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా విడుదలై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో, ఇటీవల జూన్ 27న చిత్ర యూనిట్ ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేసింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అవా ఎంటర్టైన్మెంట్’ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని ప్రముఖ భాషలైన తమిళ్, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేని సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమాను వీక్షించే అవకాశం దక్కడంతో, యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తెచ్చుకుంటుంది.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ పౌరాణిక గాథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో అంతటి క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఇందులో నటించిన అగ్ర నటీనటులే. మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో మెరవడంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read
- Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
- Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
- Suriya 50: సూర్య 50వ సినిమాగా 'రోలెక్స్'.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
- The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
తాజావార్తలు
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!