Read Also : Poorna : గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ.. రెండోసారి..!
గతంలో నడిగర్ సంఘ ఎన్నికల్లో విశాల్ పోటీ చేసినప్పుడే ఈ ప్రామిస్ చేశాడు. సంఘ భవనంలోనే తాను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మొత్తానికి అన్న మాట ప్రకారమే అందులో పెళ్లి చేసుకుంటున్నాడు. ధన్సికతో విశాల్ చాలా సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాడు. కానీ ఇన్నేళ్లు ఈ విషయాన్ని దాచి పెట్టాడు. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ లో తమ పెళ్లిని ప్రకటించాడు. అప్పటి నుంచి ఇతగాడి పెళ్లి కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
Read Also : Mrunal Thakur : సోఫాలో పడుకుని వయ్యారాలు చూపిస్తున్న మృణాల్