Laatti Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, సునైనా జంటగా వినోత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ మరియు నంద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లాఠీ స్పెషలిస్ట్ మురళీగా విశాల్ కనిపించాడు. భార్య, కొడుకుతో హ్యాపీగా నివసిస్తున్న కానిస్టేబుల్ మురళీ కొన్ని కారణాల వలన సస్పెండ్ అవుతాడు.. ఆ సస్పెన్షన్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి అధికారుల చుట్టు తిరిగి ఎలాగోలా మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. డిపార్ట్మెంట్ లో లాఠీ స్పెషలిస్ట్ మురళీగా పేరు ఉన్న అతను ఒక క్రిమినల్ బ్యాన్ తో తలపడాల్సి వస్తోంది. చివరికి ఆ యుద్ధంలో మురళీ గెలిచాడా..? క్రిమినల్ గ్యాంగ్ హెడ్ కొడుకును మురళీ ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ గగూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. ఇక ఒక్క యాక్షన్ పార్ట్ మాత్రమే కాకుండా ఒక ఫ్యామిలీ మ్యాన్ ను కూడా చూపించారు. భార్యతో, కొడుకుతో ఒక మధ్యతరగతి మనిషి ఎలా అయితే జీవిస్తాడో వాటిని చూపించి ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్ గా నిలిచింది. `లాఠీ దెబ్బకు నిజం కక్కాలి`..`నీలాంటి వాళ్లను చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే పై వాళ్లు మాకు ఇచ్చేది ఆర్డర్ కాదురా..ఆఫర్“ అంటూ రక్తం ఓడుతున్నా విశాల్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. మొత్తానికి విశాల్ పోలీసోడి లాఠీ పవర్ చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విశాల్ ఇంకో హిట్ అందుకుంటాడేమో చూడాలి.