Shine Tom Chacko : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పేరు మార్మోగిపోతోంది. వరుస వివాదాలతో ఈ నటుడు చిక్కుల్లో పడ్డాడు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ నటి విన్సీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ కు ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఈ టైమ్ లోనే షైన్ టామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల అరెస్ట్, బెయిల్ రావడం కూడా చకచకా జరిగాయి. ప్రస్తుతం రెండు వివాదాల్లో చిక్కుకోవడం.. అవి కూడా పెద్దవి కావడంతో షైన్ టామ్ కెరీర్ పై నీలి నీడలు ఏర్పడ్డాయి. ఇలాంటి టైమ్ లో నటి విన్సీ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆమె వ్యాఖ్యలతో షైన్ టామ్ చాకోకు భారీ ఊరట లభించినట్టు అయింది.
Read Also: Sampath Nandi : అందుకే అక్కడ ఫస్ట్ నైట్ సీన్లు పెడుతా.. సంపత్ నంది క్రేజీ ఆన్సర్
‘నేను ప్రముఖ నటుడు షైన్ టామ్ మీద ఎలాంటి లీగల్ చర్యలు తీసుకోవాలని అనుకోవట్లేదు. ఈ సమస్యపై ఎలాంటి కేసులు పెట్టదలచుకోలేదు. దీన్ని అంతర్గతంగానే పరిష్కరించుకుంటా. ఒక నటుడు కెరీర్ ను దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు. షైన్ టామ్ చాకో ఇకనైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. కానీ మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ కు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెనక్కి తీసుకోను. ఎందుకంటే మలయాళ ఇండస్ట్రీలో మార్పు రావాలి. ఇక్కడితో ఈ వివాదం గురించి నేను మాట్లాడను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఈ వివాదం నుంచి షైన్ టామ్ బయట పడ్డట్టు అయింది. ఇతను తెలుగులో దసరా సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.