యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్, సౌత్ స్టార్ కార్తీలకి కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. వీళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మినిమమ్ గ్యారెంటీ అని అందరూ నమ్ముతారు. హోమ్లీ ఇమేజ్ ని ఎక్కువగా మైంటైన్ చేసే ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. ఈ దీపావళి ఫెస్టివల్ కార్తీ, ధనుష్, శివకార్తీకేయన్ మధ్య వార్ కి కారణం అయ్యింది. శివ కార్తికేయన్ నటిస్తున్న సైన్క్ ఫిక్షన్ డ్రామా ‘అయలాన్’… భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని దీపావళికి రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇదే సమయంలో ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ధనుష్ దీపావళిని టార్గెట్ చేస్తూ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారి బడ్జట్ సినిమాపై ఇప్పటికే సాలిడ్ బజ్ ఉంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని ధనుష్ అగ్రెసివ్ గా ప్రమోట్ చెయ్యడం గ్యారెంటీ.
ఈ రెండు సినిమాలకి పోటీగా కార్తీ నటిస్తున్న ‘జపాన్’ సినిమా కూడా రిలీజ్ కానుంది. రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కార్తీ కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వార్ హీట్ ఎక్కింది, తమిళనాడులో ఉన్న థియేటర్స్ ఇద్దరు స్టార్ హీరోల రెండు సినిమాలకి మాత్రమే న్యాయం చెయ్యగలవు కాబటి ఈ మూడు సినిమాల్లో ఏది వాయిదా పడుతుందా అని ట్రేడ్ వర్గాలు ఆలోచిస్తూ ఉంటే నేను కూడా రెడీ అంటూ చియాన్ విక్రమ్ కూడా రంగంలోకి దిగాడు. విక్రమ్ నుంచి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ‘ధ్రువ నచ్చితరం’ సినిమా దీపావళికి రిలీజ్ కానుందనే మాట కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా రిలీజ్ రేస్ లోకి వస్తే దీపావళికి కోలీవుడ్ లో రచ్చ రచ్చ జరగడం గ్యారెంటీ. మరి నలుగురు హీరోలు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చేస్తారా? లేక ఎవరైనా వాయిదా వేసుకుంటారా అనేది చూడాలి.