స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ మూవీ తొలి పార్ట్ ని ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామంటూ చిత్ర బృందం బుధవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష ల ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అన్ని బాగానే ఉన్నాయి కానీ చియాన్ విక్రమ్ పోస్టర్ మాత్రం అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఆ పోస్టర్ లో విక్రమ్ ఫేస్ ఏదో అతికించినట్లు కనిపించింది.. లేదా వీడియో లో నుంచి స్క్రీన్ షాట్ తీసి ఎడిట్ చేసినట్లుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది విక్రమ్ ని అవమానించడమే అని ఫ్యాన్స్ మణిరత్నం ని ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఒక స్టార్ హీరో రేంజ్ ని దృష్టిలో పెట్టుకొని అయినా పోస్టర్ ని రిలీజ్ చేయాలి కదా. ఇది విక్రమ్ కి అవమానమే అంటూ ఫ్యాన్స్ మణిరత్నంపై సోషల్ మీడియా వేదికగా కామెంట్ లు పెడుతున్నారు. మరి ముందు ముందు ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోకపోతే అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదు అంటున్నారు.