Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఆయన చేసిన గత సినిమాల కంటే దీని మీదనే ఎక్కువ హైప్ ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న విజయ్.. ఈ మూవీని మే 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ వైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ టైమ్ లో దేశమంతా అటు వైపే చూస్తోంది. సినిమా రిలీజ్ చేసినా వచ్చే వారు కనిపించట్లేదు. పైగా అదే మే 30న భైరవం సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
Read Also : RRR : RRR టీమ్‌తో సందడి చేయనున్న మహేష్ బాబు
కింగ్ డమ్ కు భారీ బడ్జెట్ కేటాయించారు. కాబట్టి సోలోగా వస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నారంట. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ చేసిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాబట్టి వాటిని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మంచి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మే 30న కాకుండా జులైకి పోస్ట్ పోన్ చేసుకోవాలని చూస్తున్నారంట. జూన్ నెలలో వరుసగా పెద్ద సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, కుబేర వస్తున్నాయి. ఆ గ్యాప్ లో రావడం కంటే జులై నెలలో సింగిల్ గా వస్తే బెటర్ అని చూస్తున్నారంట. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : APCOB Chairman: ఆప్కాబ్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే!