Vijayashanthi : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు నిర్వహించగా.. చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇందులో విజయశాంతి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారంటూ కితాబు ఇచ్చింది. నందమూరి బిడ్డలకు వారి తాత మనస్తత్వం వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడని.. అందుకే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారంటూ తెలిపింది విజయశాంతి.
Read Also : Murder: తల్లే హంతకురాలు.. లిఖిత హత్య కేసును ఛేదించిన పోలీసులు..
‘జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి నటుడు, మంచి డ్యాన్సర్.. అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి. ఆయన గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు అంత పెద్ద హీరో అయ్యాడు అంటే ఆయన కష్టం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ గురించి కల్యాణ్ రామ్ ఎప్పుడూ గొప్పగా చెబుతుంటాడు. తమ్ముడు చాలా కష్టపడుతాడని.. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యాడని కల్యాణ్ రామ్ నాతో చెబుతుంటాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా అన్న మీద అమితమైన ప్రేమ ఉంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకంటున్నా’ అంటూ విజయశాంతి చెప్పుకొచ్చింది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది అంటూ తెలిపింది విజయశాంతి.