గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం చేస్తూ విజయ్ తన పార్టీ TVK అనౌన్స్మెంట్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేయము కానీ 2026కి సిద్ధంగా ఉంటాం, ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యట్లేదు అంటూ విజయ్ చాలా క్లియర్ గా తన పార్టీ అనౌన్స్మెంట్ సమయంలో చెప్పేసాడు. పూర్తిగా రాజకీయాలపై ద్రుష్టి పెట్టనున్న విజయ్… సినిమాలు కూడా ఆపేస్తానని చెప్పేసాడు. దీంతో అటు పొలిటికల్ అండ్ సినిమాల పరంగా విజయ్ హాట్ టాపిక్ అయ్యాడు. సినీ అభిమానులు విజయ్ ని సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేసుకుమంటున్నారు కానీ విజయ్ అందుకు సిద్ధంగా లేడు. సినిమాలు ఆపేసి కేవలం రాజకీయాలు మాత్రమే చూసుకోవాలి అనుకుంటున్నాడు అందుకే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు తప్ప విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు.
ప్రస్తుతం వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చేస్తున్న విజయ్… కార్తిక్ సుబ్బరాజ్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అనే మాట వినిపిస్తోంది. దళపతి 69 విజయ్ లాస్ట్ సినిమా అవుతుంది. ఈ మూవీ కార్తీక్ సుబ్బరాజ్ తో ఉంటుందా లేక వెట్రిమారన్ తో ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే వెట్రిమారన్ తో సినిమా చేయాలని విజయ్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఫ్లాప్ అనేదే తెలియని దర్శకుడైన వెట్రిమారన్… ఎలాంటి కథతో సినిమా చేసినా అది రూటెడ్ గా ఉండి అందరికీ కనెక్ట్ అవుతుంది. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి విజయ్ కి ఇప్పుడు ఇలాంటి సినిమానే కావాలి. సో విజయ్ వెట్రిమారన్ తోనే సినిమా చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ని డీవీవీ దానయ్య నిర్మించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.