Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఇక ఈ మధ్యనే విజయ్.. లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. ఈ ఏడాది విజయ్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఒక రెండు సినిమాలు చేతులో ఉన్నాయి. వాటిని త్వరగా ఫినిష్ చేసి.. పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రాల్లో గోట్ ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక గత కొన్నిరోజులుగా విజయ్ లుక్ నెట్టింట ట్రోల్ అవుతున్న విషయం తెల్సిందే. మీసాలు, గడ్డం లేకుండా హెయిర్ ముందుకు కట్ చేయించి విజయ్ కనిపించాడు. అసలు విజయ్ యేనా ఇలా ఉన్నది అని అన్న అనుమానము కూడా అభిమానులకు వచ్చింది. ఏ సినిమా కోసమో తెలియదు కానీ, కొన్నిరోజులుగా విజయ్ ఇలానే మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఈ లుక్ చూసిన నెటిజన్స్.. విజయ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ ముఖం ఏంటి.. ఆ హెయిర్ ఏంటి.. హీరోలా ఉన్నాడా.. ? అసలు. పండు కోతిలా ఉన్నాడు అని కొందరు. ఇంకొంతమంది అయితే ప్రేమలు హీరోయిన్ మమితా బైజు హెయిర్ స్టైల్ కాపీ కొట్టాడు అని చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది యూట్యూబర్ మౌళి వెర్షన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంకొందరు మాత్రం ఒక స్టార్ హీరోను పట్టుకొని అంత మాట అంటారా.. ఎంత ధైర్యం ..? సరదాగా సెటైర్లు వేస్తున్నారు.