రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథలని అంతే పొయిటిక్ గా తెరకెక్కించే శివ నిర్వాణ… ఖుషి సినిమాని కూడా అందరికీ నచ్చే సినిమాగా రూపొందించినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సస్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో విజయ్ ఖుషి సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. ఇందులో భాగంగా నేషనల్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ… ఒక ప్రశ్నకి సమాధానంగా “నాకు పోకిరి సినిమాలో మహేశ్ ఇంట్రడక్షన్ సీన్ ఇష్టం. అలాంటి ఇంట్రో నా మూవీలో ఒకటి పెట్టుకోవాలి. అదెప్పుడు కుదురుతుందో చూడాలి. నా డైరెక్టర్స్ ని అడుగుతూ ఉంటాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ సీన్ ని రీక్రియేట్ చేసి ట్రిబ్యూట్ లా ఇవ్వాలి” అంటూ మాట్లాడాడు.
ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ విజయ్ మాట్లాడిన బిట్ ని కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో పండుగాడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ లో మిర్చి గాల్లోకి ఎగరేసి, పూరి ఆ ఘాటుని కలెక్షన్లగా మార్చాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ లో పోకిరి పక్కా ఉంటుంది. అలాంటి సీన్ ని విజయ్ దేవరకొండ రీక్రియేట్ చేయాలి అనుకోవడం మంచి విషయం. మరి ఏ డైరెక్టర్ విజయ్ పోకిరి ఇంట్రడక్షన్ ని రీక్రియేట్ చేసే రేంజ్ సీన్ ని రాస్తారో. ఇప్పటికైతే విజయ్ ఖుషి సినిమాతో హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకోని ఉన్నారు, ఏం జరుగుతుందో చూడాలి.