అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. ఊర మాస్ గెటప్ లో బన్నీ లుక్ అదరగొట్టేసింది. ఇక ఎప్పుడు స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే బన్నీ నేడు కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించాడు. అయితే అక్కడ ప్రతి ఒక్కరి చూపు బన్నీస్వెట్‌షర్ట్ పైనే ఉన్నాయి.. బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్ పై ‘రౌడీ లవ్స్ అల్లు అర్జున్’ అని రాసి ఉంది.. దీంతో ఆ స్వెట్‌షర్ట్ ఎవరు పంపారా..? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇక దీనికి సమాధానంగా ఈ స్వెట్‌షర్ట్ ని బన్నీకి గిఫ్ట్ గా ఇచ్చింది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అన్నట్లు అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ తో బట్టల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బన్నీకి విజయ్ స్పెషల్ క్లాత్స్ పంపించాడు. ఇక తాజాగా పుష్ప సినిమాకు కంగ్రాట్స్ చెప్తూ తన రౌడీ క్లబ్ క్లాతింగ్ నుంచి కస్టమైజ్‌డ్ చేయించిన బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్‌ను బన్నీకి బహుమతిగా అందించాడు. ఇక ఈ స్వెట్‌షర్ట్ తోనే బన్నీ థియేటర్లో సందడి చేశాడు. అంతేకాకుండా క్లాత్స్ పంపిన విజయ్ కి బన్నీ థాంక్స్ చెప్పాడు.. విజయ్ రాసిన లెటర్ ని, క్లాత్స్ ఫోటోని షేర్ చేస్తూ “బట్టలు పంపినందుకు థాంక్స్ మై డియర్ బ్రదర్ దేవరకొండ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్వెట్‌షర్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
